అతి తక్కువ ధరలో కొత్త ఫోన్‌

అతి తక్కువ ధరలో కొత్త ఫోన్‌

దేశీ బ్రాండ్‌గా ఒకప్పుడు ఇండియా మార్కెట్‌లో హవా చెలాయించిన మైక్రోమ్యాక్స్‌ మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తనదైన శైలిలో అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ తెస్తోంది.గతేడాది మైక్రోమాక్స్‌ ఐఎన్‌ 1బీ మోడల్‌ని మార్కెట్‌లోకి మైక్రోమ్యాక్స్‌ విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మైక్రోమ్యాక్స్‌ ఐన్‌ 2బీని రిలీజ్‌ చేస్తోంది. ఐఎన్‌ 2బీ ఫోన్‌ పెర్ఫామెన్స్‌ స్మూత్‌గా ఉంటుందని, హ్యంగ్‌ ఫ్రీ ఫోన్‌ అంటూ మైక్రోమ్యాక్స్‌ క్లయిమ్‌ చేసుకుంటోంది.

ఈ మొబైల్‌లో యూనిసాక్‌ టీఎ610 చిప్‌సెట్‌ని మైక్రోమ్యాక్స్‌ ఉపయోగిస్తోంది.ఆడ్రాంయిడ్‌ 11 వెర్షన్‌పై ఐన్‌ 2బీ మోడల్‌ ఫోన్‌ పని చేస్తుంది. ఈ మొబైల్‌ను 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌లు 64 జీబీ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 4 జీబీ వేరియంట్‌ మొబైల్‌ ధర రూ. 7,000లు ఉండగా 6 జీబీ ర్యామ్‌ మొబైల్‌ ధర రూ. 8,999లుగా ఉంది. ఆగస్టు 4న ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా 2బీ మొబైల్‌ లాంచ్‌ చేయనుంది మైక్రోమ్యాక్స్‌.

మైక్రోమ్యాక్స్‌ 2బీలో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. దీంతో 15 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్‌, 20 గంటల బ్రౌజింగ్‌ టైమ్‌ని అందిస్తోంది మైక్రోమ్యాక్స్‌. అంతేకాదు ఈ సెగ్మెంట్‌లో ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌స్కానర్‌ ఈ మొబైల్‌లో పొందు పరిచారు. బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌ కలర్లలో ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి రాబోతుంది. ఇందులో 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌కెమెరా, వెనుక వైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. 6.5 అంగులాల వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ హెడ్‌డీ డిస్‌ప్లేని అమర్చింది.