Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటి వరకు కంటిన్యూస్‌గా ఏడు సినిమాలతో సక్సెస్‌ను దక్కించుకున్న నాని స్టార్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం నాని రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే చిత్రం వచ్చే నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. దిల్‌రాజు నిర్మించడంతో పాటు నాని, సాయి పల్లవి జంటగా నటించడంతో సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకు నాని కెరీర్‌లో దాదాపు అన్ని సినిమాలు కూడా 25 కోట్లకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది లేదు. కాని ఈ సినిమా మాత్రం అన్ని ఏరియాల రైట్స్ మరియు ఆన్ లైన్ శాటిలైట్ రైట్స్ ద్వారా ఏకంగా 40 కోట్ల వరకు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నాని గత చిత్రం ‘నేను లోకల్’ మరియు ఇంకా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద 30 నుండి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడం జరిగింది. అందుకే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దిల్‌రాజు ఈ చిత్రం కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్ ఎంతో తెలుసా 18 కోట్లు. ప్రమోషన్‌తో కలిపి మొత్తంగా 20 కోట్ల మేరకు దిల్‌రాజు ఈ చిత్రానికి ఖర్చు చేయబోతున్నాడు. 20 కోట్ల బడ్జెట్ చిత్రానికి 40 కోట్ల బిజినెస్ జరగడం అనేది టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చే విషయం.
వరుసగా విజయాలతో దూసుకు పోతున్న నాని ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ‘ఫిదా’తో ఆకట్టుకున్న సాయి పల్లవి మరోసారి తన సత్తా చాటి తెలుగులో స్టార్ అయిపోవడం ఖాయం అంటున్నారు.