చీకట్లో 1.1 మిలియన్ ప్రజలు ,అమెరికాలో ఏం జరుగుతోంది?

1.1 million people in the dark in America.
America

అమెరికా మరోసారి తుఫాను ఊభిలో చిక్కుకుంది. వడగళ్లు, మెరుపులతో పాటు వేగంగా గాలులు చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. తుఫాను ధాటికి ఉత్తర అమెరికా నుంచి వెళ్లాల్సిన 1000 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చాలా వరకు ఇళ్లు, వ్యాపాపాలు తీవ్రంగా నష్టం చేకూర్చాయి. ఈ తుఫాను తీవ్రతలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అధ్యక్షుడు బైడెన్ పలు ప్రాంతాల్లో పర్యటించాల్సిన టూర్ ను రద్దు చేసుకొని కార్యాలయంలో తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని ఫెడరల్ కార్యాయాలు మూసివేయాలని, మధ్యాహ్నం 3 గంటలలోపు ఉద్యోగులు ఇంటికి చేరుకోవాలని అధికారులు సూచించారు. తుఫాను కారణంగా పలు రాష్ట్రాల్లో పవర్ కట్ అయింది. దీంతో మిలియన్ల కొద్దీ ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.

అమెరికాలోని నేషనల్ వెదర్ సర్వీస్ గ్రేటర్ డీసీ ప్రాంతంలోని టోర్నడో కేంద్రం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ బీభత్సం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. దాదాపు 10 రాష్ట్రాల్లో టేనస్సీ నుంచి న్యూయార్క్ వరకు సుడిగాలుల్లో చిక్కుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం 29.5 మిలియన్లకు పైగా ప్రజలు ఈ తుఫానులో చిక్కుకున్నట్లు వెదర్ సర్వీస్ తెలిపింది. అలబామాలోని ప్లోరెన్స్ లో 28 ఏళ్ల వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడని ‘వే’ టీవీ తెలిపింది.

తుఫాను కారణంగా వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం రాత్రి నాటికి 2,600 కంటే ఎక్కువ యూఎస్ విమానాలను ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం రద్దు చేయబడ్డాయని తెలిపింది. అలాగే 7,900 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పేర్కొన్నాయి.

పలు రాష్ట్రాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.దీంతో సోమవారం సాయంత్ర అయ్యేసరికి అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మేరీ ల్యాండ్, డెలావేర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెనస్సీ, వెస్ట్ వర్జినియా ల్లో 1.1 మిలియన్ కంటే ఎక్కువ మంది విద్యుత్ ను కోల్పోయారు. తుఫాను ఉన్న అన్ని రాష్ట్రాలు విద్యుత్ అంతరాయం ఉంటుందని టేనస్సీలోని యూటిలిటీస్ బోర్డు ట్విట్ చేసింది.