మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ సాఫ్ట్‌ అయ్యారనుకుంటున్నారా..?. లోపల ఒరిజినల్‌ అలాగే ఉంది అంటూ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లలో ఎవరూ ఊహించని విధంగా కామారెడ్డి జిల్లాని అభివృద్ది చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 3,400 గ్రామపంచాయతీలని కొత్తగా ఏర్పాటు చేసింది కేసీఆర్‌. ప్రతి పేదవాడి మొహంలో సంతోషం చూడాడనికి సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తెలంగాణలో నడుస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయండని అడుగుతున్నారు. వెకిలి మాటాలు మాట్లాడేవాళ్లు ఎక్కువైండ్రు. కేసీఆర్‌ మీద మాట్లాడితే ఊరుకోం. ఏప్రిల్‌ 27కి ఇరవై ఏళ్లు నిండినయి. ఒక ప్రాంతీయ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం ఎంత కష్టం.

ఉద్యమానికి గులాబీ జెండా మోసినప్పుడు అప్పటి ప్రభుత్వం 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది.కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా కేసీఆర్‌ ఉన్నాడు. ఒక్కొక్క అడుగువేస్తూ ఆనాడే ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చింది నిజామాబాద్‌ జిల్లా. తెలంగాణ కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్‌. 50,60 ఏండ్లు రాజకీయం చేసిన షబ్బీర్‌ అలీకి సిగ్గు, ఎగ్గూ ఏమీ లేదు. కేసీఆర్‌ ఆశీస్సులతో కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంటు లేదు, సాగు, త్రాగు నీరు లేదు. 200 రూపాయల పెన్షన్‌కి కాంగ్రెస్‌ వాళ్లు డబ్బాలు కొట్టుకున్నారు.

42 లక్షల మందికి రూ.10వేల కోట్లను నెలకి పెన్షన్ల రూపంలో ఇస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. భారతదేశంలో మొదటిసారి ఒంటరి మహిళకు పెన్షన్‌ ఇస్తోంది కేసీఆర్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులకి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో అన్నం పెడుతున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ మాత్రమే’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.