అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా… మంత్రి లోకేష్

AP శాసనమండలి
AP శాసనమండలి

ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలపై చర్చ వాడి వేడిగా జరుగుతోంది. బీసీ ల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై వైసీపీ సభ్యుల ఆరోపణలకు ధీటుగా మంత్రులు నారా లోకేష్ , సవిత సమాధానం చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. వైసీపీ సర్కారు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు.