చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రమాణానికి రావాలి

చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రమాణానికి రావాలి

అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని.. నిరూపించలేకపోతే ఆయన ఆస్తి తనకు రాసిస్తారా అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్‌ విసిరారు. తాను రాజకీయాలలోకి వచ్చి అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు.

‘‘నాపై ఆరోపణలు అవాస్తవాలని కాణిపాకంలో ప్రమాణం చేస్తా. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రమాణానికి రావాలి. ఎస్సీ, ఎస్టీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఇద్దరు ఎస్సీలను అడ్డు పెట్టుకుని విమర్శలు చేయిస్తున్నారంటూ’’ నారాయణ స్వామి నిప్పులు చెరిగారు