వరద బాధితులతో కర్ణాటక మంత్రి రేవణ్ణ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వరద బాధితులపట్ల ఆయన ప్రవర్తించిన తీరు విమర్శల పాలవుతోంది. జనాలంటే చిన్న చూపా అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు, వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అక్కడి ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనాల్సి పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తోంది ప్రభుత్వం. కేరళకు సరిహద్దుల్లో కర్ణాటకలోని హసన్ జిల్లాలో రామంతపురం గ్రామాన్ని మంత్రి సందర్శించారు. అక్కడికి మంత్రి హోదాలో వెళ్ళిన హెచ్‌డీ రేవణ్ణ మానవత్వాన్ని మరిచారు. వరద బాధిత క్యాంపులను సందర్శించిన ఆయన అక్కడ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.
ఆహార పదార్ధాలను బాధితుల చేతికి అందివ్వకుండా వారిపైకి విసిరేశారు. రామనాథపురం రిలీఫ్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.సీఎం కుమారస్వామి సోదరుడైన మంత్రి రేవణ్ణ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన ప్రవర్తన సరిగా లేదని ఆరోపిస్తున్నారు. కొందరు ఆ ఆహార పదార్ధాలను స్వీకరించేందుకు నిరాకరించారు. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా ఆహారం అందజేస్తున్న మంత్రి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, రేవణ్ణ తీరుకు ఆయన కుమారుడు ప్రజ్వల్ దీనిపై స్పందించారు. అది కావాలని చేసింది కాదని, తన తండ్రి ఎప్పుడూ హుందాగానే వ్యవహరిస్తారని చెప్పారు. ఆ రోజు వేరే ఊరు వెళ్లేహడావిడిలో ఉండి ఆ విధంగా వ్యవహరించి ఉండొచ్చని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల కర్నాటక తీర ప్రాంతాలైన మల్నాడ్, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమంగళూరు, కొడగు, హసన్ జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
Brother of CM Kumarswamy
Son of Ex PM Devegowda
Karnataka PWD Minister RevannaGiving relief to flood victims
Yes, he is giving food to people not animals
What is a bigger disaster?
"Flood" or "politicians" like him pic.twitter.com/1I2ED5XKH4
— Kapil Mishra (@KapilMishra_IND) August 20, 2018