ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ సోదరులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధిత బాలిక 1వ తరగతి చదువుతోంది, ఆమె బయటకు వెళ్ళి తప్పిపోయింది. ఆమె చివరిసారిగా నిందితుల ఇంటి దగ్గర ఆడుతూ కనిపించింది.
బాలిక ఇంటికి తిరిగి రానప్పుడు, ఆమె కుటుంబం అంతా ఆమెను వెతకడానికి ప్రయత్నించి విఫలం అయ్యి పోలీసులను ఆశ్రయించింది. ఖేరి పోలీసులు ఆ రాత్రంతా అం కోసం వెదికారు.
అయితే తన కొడుకులు ఆమెను గొంతు కోసి చంపినట్లు తెలిసినప్పుడు మృతదేహాన్ని డంప్ చేయడానికి వారికి సహాయం చేశారని నిందితుడి తల్లి పోలీసుల వద్ద అంగీకరించడంతో బాలిక మృతదేహం కనుగొనబడింది. “నిందితుడల ఇంటి నుండి 200 మీటర్ల దూరంలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బాలికను మిఠాయితో తమ ఇంట్లోకి రప్పించారని నిందితుల ద్వారా తెలిసింది. నిందితులు ఇద్దరూ 15 మరియు 12 సంవత్సరాల వయస్సు గలవారు. వీరు దళిత కుటుంబాలకి చెందిన బాలురు, బాలిక చదువుతున్న స్కూల్ లోనే వీరు కూడా చాడువుతున్నరారని చెబుతున్నారు.
పోలీసులు ఆ ఇద్దరు సోదరులు మరియు వారి తల్లిని అదుపులోకి తీసుకున్నారు మరియు భారతీయ శిక్షాస్మృతి మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం యొక్క సెక్షన్లు 302 (హత్య) మరియు 201 (సాక్ష్యాలు కనిపించకుండా చేయడం) కింద ఈ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.