పోలీసుల అదుపులో మిస్సయిన దాసరి కొడుకు

missed dasari son is in police custody

దాస‌రి నారాయ‌ణ‌రావు ఇండ‌స్ట్రీలో అంద‌రి స‌మ‌స్య‌లు ఆయ‌న తీర్చినా కూడా సొంత ఇంట్లో స‌మ‌స్య‌లు మాత్రం తీర్చ‌లేకపోయాడు. ఇక ఆయ‌న పోయిన త‌ర్వాత అవి మ‌రింత ఎక్కువైపోయాయి. ఆయ‌న పెద్ద కోడ‌లు మీడియా ముందుకొచ్చి మ‌రీ మోహ‌న్ బాబు స‌హా ఇండ‌స్ట్రీలో కొంద‌ర్ని నేరుగానే టార్గెట్ చేసింది. ఇదిలా ఉంటే వారం రోజు కింద దాస‌రి పెద్ద కొడుకు ప్ర‌భు క‌నిపించ‌డం లేదంటూ ఆయ‌న కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో కేస్ ఫైల్ చేసారు. ఆ త‌ర్వాత పోలీసులు కూడా ఈ కేసును సీరియ‌స్ గా తీసుకున్నారు. వారం రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన ఈయ‌న జూన్ 18 సాయంత్రం రెండో భార్య ఇంటికి వ‌చ్చాడట, ఆ వెంట‌నే పోలీసులు వ‌చ్చి ఆయ‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వారం రోజులు ఏం జ‌రిగింది ఎందుకు చెప్ప‌కుండా వెళ్లిపోయాడు.. అస‌లు ఎక్క‌డికి వెళ్లాడ‌నే విష‌యాల‌పై ప్ర‌భు ద‌గ్గ‌ర ఆరా తీస్తున్నారు పోలీసులు. జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయ‌న తిరిగి రాలేదంటూ ప్ర‌భు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్ర‌యించారు. దాసరి నారాయణరావు మరణానంతరం ఆస్తి గొడ‌వ‌లు ఇంకా పెరిగాయి. ఇవే వివాదాలు ప్ర‌భు, ఆయ‌న రెండో భార్య‌కు కూడా జ‌రుగుతున్నాయి.