బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి కొడుకు, నటుడు మహాక్షయ్ ఒక యువతిని ప్రేమించి, రేప్ చేశాడనే ఆరోపణలతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు నమోదు అయిన వెంటనే పోలీసులు ఊటీలోని పెళ్లి పీటల మీద నుంచి అర్దాంతరంగా పెళ్లి కొడుకు మహాక్షయ్ ని అరెస్ట్ చేసి, అతన్ని కోర్టుకు హాజరు పరిచారు. అయితే యువతిని అత్యాచారం చేసిన కేసులో కోర్టు మహాక్షయ్కు, అతని తల్లి యోగితకు లక్ష రూపాయల పైన్ తో బెయిల్ మంజూరు చేశారు.
అలా కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే, మహాక్షయ్ కోర్టు నుంచి ఇంటికి వచ్చి తన ప్రియురాలు, ప్రముఖ హీరోయిన్ మదాలస శర్మను ఈరోజు తమిళనాడు ఊటిలోని తన విలాసవంతమైన హోటల్లో సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది నెటిజెన్స్ వీళ్ళ పెళ్లిపై ఆసక్తి కరమైన కామెంట్స్ చేస్తున్నారు. కోర్టు మెట్లు దిగి, పెళ్లి పీటలు ఎక్కినా రసికుడు అంటూ మహాక్షయ్ పై సెటైర్లు వేస్తున్నారు.