రేవంత్‌రెడ్డి అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తనను టీఆర్‌ఎస్ కోవర్ట్‌గా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఒకరు కోసమో, ఒకరు చెప్తేనో తాను పని చేయనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు బాలేదన్నారు. అంతర్గతంగా అభిప్రాయం చెప్పే పరిస్థితి కాంగ్రెస్‌లో లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.