పవన్ కళ్యాణ్‌కి మరో సారి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక

పవన్ కళ్యాణ్‌కి మరో సారి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి మరో సారి షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా పార్టీలో అంటీ ముట్టనట్టుగా ఉన్న రాపాక అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువగా తన మద్ధతు తెలుపుతున్నారు. అయితే సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశానికి రాపాక మద్ధతు తెలపబోతున్నట్టు ప్రకటించారు.

అయితే నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానులపై ఓటింగ్ జరిగితే తాను కూడా మూడు రాజధానుల ప్రతిపాదనకే ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, వికేంద్రీకరణ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో రాపాక మూడు రాజధానుల అంశానికి మద్ధతు తెలుపుతుండడం చర్చానీయాంశంగా మారింది.