స్వీటిని ప‌ట్టించుకునే నాధుడే లేడు

స్వీటిని ప‌ట్టించుకునే నాధుడే లేడు

బాహుబ‌లి త‌ర‌వాత  ఒక్క నిశ్శ‌బ్దం మాత్ర‌మే అనుష్క చేతిలో ఉన్న సినిమా. అదెప్పుడో పూర్త‌యిపోయింది. కానీ… విడుద‌ల తేదీనే వాయిదాలు ప‌డుతూ వస్తోంది. ఈనెల 31న ఈసినిమాని తీసుకొద్దామ‌నుకున్నారు. ఏమైందో ఏమో… అంత‌లోనే మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఆ సినిమాకి ప్ర‌మోష‌న్లు కూడా ఏమీ లేవు. చేతిలో ఉన్న ఒక్క సినిమానే విడుద‌ల‌కు కుస్తీ పాట్లు ప‌డుతోందంటే… ప‌రిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. తెలుగు చిత్ర‌సీమ దాదాపుగా అనుష్క‌ని మ‌ర్చిపోయే స్థితికి వెళ్లిపోయింది.

ఈ ప‌రిస్థితికి అనుష్క కూడా ఓ కార‌ణ‌మే. త‌న‌కొచ్చిన అవ‌కాశాల్ని లైట్ తీసుకుంది. ఫిజిక్‌పై శ్ర‌ద్ధ చూపించ‌లేదు. కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉండాల‌న్న కఠిన నిర్ణ‌యం తీసుకుంది. దాంతో ఆమె చేయాల్సిన పాత్ర‌లు మ‌రొక‌రి చేతిలోకి వెళ్లిపోయాయి. తీరా ఇప్పుడు స్వీటిని ప‌ట్టించుకునే నాధుడే క‌రువ‌య్యాడు. నిశ్శ‌బ్దం విడుద‌లై.. ఆ సినిమా హిట్ట‌యితే, అప్పుడు మ‌ళ్లీ త‌న కెరీర్‌కి ఊపొస్తుంద‌ని భావిస్తోంది. కానీ ఆ సినిమా ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో తెలీదు.

పైగా నిశ్శ‌బ్దంకి ఎలాంటి బ‌జ్ లేదు. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో స్వీటీ కూడా టెన్ష‌న్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ఎప్పుడూ త‌న సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఆలోచించ‌ని అనుష్క‌.. ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో నిర్మాత‌ల‌పై ఒత్తిడి తీసుకొస్తుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికీ ఈ చిత్ర నిర్మాత‌ల‌కూ, అనుష్క‌కీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చేసింద‌ట‌. ప్ర‌మోష‌న్ల‌లో అనుష్క క‌నిపించే అవ‌కాశాలూ అంతంత మాత్ర‌మే అని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.