భావోద్వేగానికి గురైన చంద్రబాబు

భావోద్వేగానికి గురైన చంద్రబాబు

గత కొద్దీ రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రాజధాని విషయంలో అటు ప్రభుత్వ నేతలకు మరియు, ప్రతిపక్ష నేతలకు, రాష్ట్ర ప్రజలందరికి కూడా పోరాటం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్మించడం అనేది సరైన నిర్ణయం కాదని, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వాపోతున్నారు. ఇకపోతే సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఇకపోతే గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్న సమయంలో ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టులు అన్ని కూడా తరువాత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొనసాగించారని గుర్తు చేసుకున్నారు.

అలాగే చంద్రబాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చంద్రబాబు కోరుకున్నారు. ఈమేరకు చంద్రబాబు మాట్లాడుతూ… “నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి కోపం లేదు. తాను నాకంటే వయసులో చాలా చిన్నవాడు. అయినప్పటికీ కూడా తనకు నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను… ఆలోచించండి, తొందరపడొద్దు, ఇది మంచిది కాదు. రాజధాని విషయంలో కూడా కాస్త ఆలోచించండి…” అంటూ చంద్రబాబు వాఖ్యానించారు.