ఆరు నెలలు అమెరికాలో ఆరు నెలలు భారత్‌లో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయాలు చేయడం మధుయాష్కీకి పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం LB నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుయాష్కీ తీరును సుధీర్‌రెడ్డి ఎండగట్టారు. LB నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల చీకటి పొత్తుతోనే ప్రోటోకాల్ రగడ సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. మధుయాష్కీ అవగాహన లేమితో బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులను తప్పుదోవపట్టించి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.