ఇలాంటి నాయకులే కదా మనకి కావాల్సింది !

mla vanthala rajeswari with delivered lady issue

కొన్ని విషయాలు విన్నప్పుడు ఎలా స్పందించాలో అర్ధం కాదు, మంచి జరిగిందని బాధ పడాలో లేక తమ తమ బాద్యతలు సరిగా చేయాల్సిన వారు సక్రమంగా చేయట్లేదని బాధ పడాలో అర్ధం కానీ పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని ప్రజారంజకమయిన పధకాలు ప్రవేసపెట్టినా వాటిని ప్రజలకి సక్రమంగా అందేలా చూడాల్సింది సంబందిత అధికారులు మాత్రమే, కానీ యా అధికారులలో పేరుకుపోయిన అలసత్వం, విధుల మీద ఉన్న అయిష్టత వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం సంగతి పక్క పెడితే ఎంతో విలువయిన ప్రాణాలని పణంగా పెట్టాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఇంత కంఠ శోష ఎందుకంటే గిరిజనుల పట్ల కొందరు అధికారులు, సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతున్న ఘటన ఇది.

ఆ వివరాల్లోకి వెళితే, బంద గ్రామానికి చెందిన కలుముల దుర్గ అనే మహిళ తన ఇంట్లో బిడ్డకి జన్మనిచ్చింది. దుర్గ వైద్య పరీక్షల కోసం తూర్పు గోదావరి జిల్లా బోదులూరు పీహెచ్సీకి మెరుగైన వైద్యం నిమిత్తం వెళ్లింది. ఆపై ఆమెను ‘తల్లీ బిడ్డా ఎక్స్ ప్రెస్’లో ఇంటికి చేర్చాల్సిన సిబ్బంది, మరో ఏడు కిలోమీటర్ల దూరం వుండగా మద్యలోని ఆకుమామిడికోటలో రోజుల పసిబిడ్డతో సహా దింపేసి, అక్కడి నుంచి ఆమె నివాసమున్న బంద గ్రామానికి నడిచి వెళ్లాలని ఓ ఉచిత సలహా పారేసి తమదారిన తాము పోయారు. దీంతో చేసేదేమీ లేక, బిడ్డను ఎత్తుకున్న ఆ బాలింత రోడ్డుపై నడిచి వెళుతుండగా, మారేడుమిల్లి మండలంలో జరిగిన ‘గ్రామదర్శిని – గ్రామవికాసం’లో పాల్గొని వస్తున్న రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆమెను చూశారు.

దీంతో కారు దిగి ఏ జరిగిందని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బాలింత ఎమ్మెల్యేకు వివరించింది. దీంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే హుటాహుటిన సదరు బాలింత దుర్గను తన కారులో ఎక్కించుకుని బోదులూరు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ వైద్యాధికారులు లేకపోవడంతో సిబ్బందితో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దగ్గరుండి బాలింతకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు రెండువేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బాలింతను అంబులెన్సులో స్వగ్రామానికి చేర్చారు.