ప్రతీ నియోజకవర్గంలో 50వేలకు పైగా టీఆర్ఎస్ సభ్యత్వాలు నమోదయ్యేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం అందరినీ ఐక్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. తెలంగాణ ఫలాలు ప్రతీ వ్యక్తికి అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నాం. 15వ తేదీలోపు సభ్యత్వం పూర్తి చేసి, గ్రామ, మండల కమిటీలు ఎన్నుకోవాలి. ప్రతీ కమిటీలో 51శాతంకు తగ్గకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు అవకాశం కల్పించాలి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని పల్లా పేర్కొన్నారు.
గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యత్వ నమోదు ఇంచార్జీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. సామాన్య ప్రజలు సైతం టీఆర్ఎస్ సభ్యత్వాలను తీసుకుంటున్నారు. ఎక్కడ చూసిన సభ్య త్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది.