జమ్మూ కశ్మీర్‌ లో కలకలం

జమ్మూ కశ్మీర్‌ లో కలకలం

ప్రజాస్వామ్యం, కృతనిశ్చయం విషయంలో జమ్మూ కశ్మీర్‌ సరికొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రెండుమూడేళ్లుగా తమ ప్రభుత్వం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారి మోదీ కశ్మీర్‌లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 20వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.వీటిలో బనిహాల్‌– ఖాజీగుండ్‌ రోడ్‌ టన్నెల్‌ కూడా ఉంది.

దీనివల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు. పంచాయతీ దివస్‌ ర్యాలీని పురస్కరించుకొని దేశంలోని అన్ని పంచాయతీలను ఉద్దేశించి ఆయన పల్లి గ్రామంలో ప్రసంగించారు. గత రెండేళ్లలో లోయలో రూ. 38వేల కోట్ల ప్రైవేట్‌ పెట్టుబడులు వచ్చాయని, టూరిస్టులు కూడా పెరిగారని చెప్పారు. అంతకు ముందు 7 దశాబ్దాల కాలంలో కశ్మీర్‌కు కేవలం 17 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు.