‘మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్’ జాబితాలో నెంబర్ వన్​గా మళ్లీ ‘మోదీ’నే

Political Updates: 'Don't compare India with China'.. PM Modi made harsh comments
Political Updates: 'Don't compare India with China'.. PM Modi made harsh comments

భారత్​లోనే కాదు ప్రపంచ దేశాల్లో పాపులారిటీ ఉన్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాధినేతలు కూడా మోదీని బహిరంగంగా చాలా సార్లు ప్రశంసించారు. ఇక విదేశీయుల మనసులోనూ మోదీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తిగా ,మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్​గా మోదీకి తెలిసిన విషయమే. తాజాగా మరోసారి మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ జాబితాలో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ప్రపంచ నేతల వారంవారీ పాపులారిటీ రేటింగ్స్‌ను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వానికి ఆమోదం తెలపగా, 18 శాతం మంది తిరస్కరించారు. సర్వేలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. కొద్దికాలంగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్న మోదీ 70 శాతం ఆమోద యోగ్యతతో ఉన్నారని తెలిసింది .

ఇక మోదీ తరువాత స్థానంలో 64 శాతం ఆమోద యోగ్యత, 26 శాతం వ్యతిరేకతతో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌ రెండోస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తదితరులను వారివారి దేశాల్లో ఆమోదించేవారి కంటే తిరస్కరించే వారు ఎక్కువగా ఉన్నారు.