మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. ప్రస్తుతం బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బంగారంపై కీలక నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకోబోనున్నది. ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నిర్ణీత ప్రమాణానికి మించి బంగారం ఉంటే జరిమానా ఉంటుందని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం “ఆమ్నెస్టీ” పథకాన్ని తీస్కురానుంది.
పథకానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది ఇంకా నిర్ణీత ప్రమాణానికి మించి ఉన్న బంగారంపై ప్రతిపాదిత పథకం ప్రకారం జరిమానా ఉండ బోతుంది. క్షమాభిక్ష పథకాన్ని బంగారం పరిమితుల్లో మార్పు చేయడానికి తీసుకు రానుంది. లెక్కల్లో చూపించని బంగారాన్ని కూడా ఇప్పుడు చూపించి క్షమాభిక్ష పథకం ప్రకారం పన్ను కట్టవచ్చు. ఒక వేళ పరిమితిని మించితే జరిమానా ఉంటుంది.
దీనిపై ప్రముఖ ఆర్థిక వేత్తలు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీ నిరోదానికి ఏ నిర్ణయం తీస్కున్న మంచి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని చెబుతున్నారు. బంగారంలో నల్ల ధనం పెట్టుబడిని తగ్గించేందుకు క్షమాభిక్ష పథకాన్ని తీసుకురానున్నారని తెలిపారు.