మోడీ పక్కనుండే ఈమె ఎవరో తెలుసా ?

Modi Translation Person Gurdeep Kaur Chawla

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో వివిధ దేశాధినేతలను కలిసినపుడు కొన్ని ఫోటోలను గమనిస్తే విమానం ఎక్కింది మొదలు ఎక్కడికెళ్లినా ఓ మహిళ ఆయన పక్కన కనిపిస్తుంది. ప్రధాని మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్ళినా ఆ మహిళ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆమె గురించి కొంత కాలంగా సోషల్ మీడియాలో పలు వార్తలు, పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఆ మహిళ ఎందుకు ప్రధాని వెంటే ఉంటుంది? ఆమె ఎవరు? మోడీకి ఆమె ఏమవుతారనేది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాని వెంట ఉండే ఈమె రాజకీయ నేత కాదట, పోనీ అధికారి అనుకుంటే అదీ కాదట ఆమె. ఆమె పేరు గుర్దీప్ కౌర్ చావ్లా. ప్రధానమంత్రికి అనువాదకురాలు. గుజరాతీ అయిన మోడీ మాతృభాషలో, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఆంగ్లంలో ఆయనకు పట్టులేదు. అందుకని ఆయన అనువాదకుల సహాయం తీసుకుంటారు. అలా గుర్దీప్ ఆయనతో కలిసి 2014లో అధికార పర్యటనకు అమెరికా వెళ్లింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మోడీలకు అనువాదకురాలిగా పని చేసింది. ఆమె సేవలు మోడీకి నచ్చడంతో అనువాదకురాలిగా ఆమెనే కొనసాగిస్తున్నారు మోడీ.

Modi Translation Person Gurdeep Kaur Chawla