నరేంద్ర మోదీకి ఎక్కడ తన స్వరం గట్టిగా వినిపించాలి ఎక్కడ తగ్గి ఉండాలి అనే దానిపై మోదీకి సృష్టమైన అవగాహన ఉంది. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు పరిస్థితులను తనకి అనుకూలంగా మలుచుకునే నైపుణ్యం మోదీ సొంతం. అవసరమైన చోట తన సత్తా ఏమిటో చూపించటానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు.
తాజాగా మోదీ,ట్రంప్ కలిసి 50వేల మందికి పైనే పాల్గొన్న హుస్టన్ లోని ఎన్ ఆర్జీ స్టేడియంలో కిక్కిరిసన జన సందోహం మధ్య మాట్లాడారు. ఈ సమయంలో మోదీ అంతా బాగుంది అనే పదాన్ని హిందీ.. గుజరాతీ.. మరాఠీ.. బెంగాలీ.. తెలుగు.. కన్నడ.. తమిళంతో పాటు మరో భాషలో పలికారు. తాను మాట్లాడిన అన్ని భాషల్లో తానేం చెప్పానో ట్రంప్ నకు మోడీ వివరించారు.
అంత మంది ముందు, అలాగే ట్రంప్ ముందు మోదీ 8 భాషల్లో మాట్లాడేసరికి అందరు షాక్ అయ్యారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని అదే ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని ప్రత్యేకముగా ఉంచుతుందని భిన్న ఆచార సంప్రదాయాలు.. వేష భాషలు.. వాతావరణాలు అన్ని కూడా భారతదేశంలో వుంటాయని ఈ సందర్భంగా మోదీ వెలుగెత్తి చాటాడు.