ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా సామాజిక న్యాయం అందించడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా ముస్లిం మహిళల హక్కులు రక్షించినట్లు, వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఓటు బ్యాంకుల కోసం వక్ఫ్ నిబంధనలను మార్చారని, వక్ఫ్ పేరుతో భూమిని లాక్కుంటున్నారని, వక్ఫ్ భూ మాఫియా పేదల భూమిని దోచుకుంటోందని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.