‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 13 న పంజాబ్‌లోని అడంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇక్కడ భారతీయ వైమానిక సైనికులను కలిశారు. భారత సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. యావత్ భారతావని భారత సైన్యం ఉంటే ఉందని భరోసా ఇచ్చారు. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయానికి ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం అన్నారు.



