రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుతిన్, ఇతర దేశాలతో సంబంధాల గురించి ఈ వీడియో సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా -భారత్ మధ్య సంబంధాలు నిరంతరం అన్ని దిశల్లో అభివృద్ధి చెందుతున్నాయని, దీనికి గ్యారెంటీ ప్రధాని నరేంద్రమోడీ విధానమే అని పుతిన్ అన్నారు.
ఆమోదించొద్దని సీఎం ఆదేశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రష్యా అధినేత మాటల్ని అనువదించింది. దేశ భద్రత విషయంలో ప్రధాని మోడీ కఠిన వైఖరి చూసి తాను చాలా సార్లు ఆశ్చర్య పోయానని పుతిన్ చెప్పారు. నిజాయితీగా చెప్పాలంటే, భారతీయ ప్రజలు, భారత జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో మోడీ కఠిన వైఖరికి కొన్నిసార్లు ఆశ్చర్యం వేసిందని పుతిన్ అన్నారు. తన అభిప్రాయం ప్రకారం .. ప్రధాని మోడీ బలవంతంగా, బెదిరింపులతో నిర్ణయం తీసుకోవడాన్ని తాను ఊహించలేనని
పేర్కొన్నారు. అయితే ప్రధాని మోడీపై అలాంటి ఒత్తిడి ఉందని తనకు తెలుసని, అయినా ఆయన జాతీయ ప్రయోజనాలకు వ్య తిరేకం గా ఏదైనా నిర్ణయం తీసుకోడని అనుకుంటున్నానని పుతిన్ చెప్పారు. ఈ విషయాలను తాము బయట నుంచి చూస్తున్నామని అన్నారు. 45 సెకన్ల క్లిప్ ఇప్పుడు వేలకొద్ది వ్యూస్ సాధిస్తుంది.