బిరుదులు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటో?

mohan-babu-felicitated-with

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినీ నిర్మాత, ఎంపీ టి సుబ్బిరామి రెడ్డి గురించి తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదేమో. ఆయన ప్రతి నెలకోసారి ఏదో ఒక వేడుక నిర్వహించి మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అందరిని కలుపుకుపోయి, అందరికి అవార్డులు ఇస్తూ, సన్మానాలు చేస్తూ ఉంటాడు. ఎందరో గొప్ప నటీనటులకు అవార్డులు రాలేదని, వారు అవార్డుల విషయంలో అన్యాయంకు గురయ్యారని, ఈతరం వారు అలా కాకుడదనే ఉద్దేశ్యంతో తాను అవార్డులు ఇస్తున్నాను అంటూ టీఎస్సార్‌. అవార్డులతో పాటు స్టార్స్‌కు సన్మానాలు మరియు బిరుదులు బహూకరించడం ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు.

తాజాగా మోహన్‌బాబుకు ‘విశ్వ నట సార్వభౌమ’ అనే బిరుదును ఇవ్వడం జరిగింది. వింతగా, విచిత్రంగా ఉన్న బిరుదును టీఎస్సార్‌ కాకతీయ మహోత్సవం పేరుతో జరిగిన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మోహన్‌బాబుకు ఎందుకు ఈ బిరుదు ఇవ్వాలని ఆయనకు అనిపించింది అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. టీఎస్సార్‌ అవార్డులు, బిరుదులు ఇవ్వడం వెనుక పెద్ద పెద్ద కారణాలు ఏమీ ఉండవు అని, ఆయనకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కార్యక్రమం నిర్వహిస్తాడు. ఆయన అనుకున్నట్లుగా బిరుదులు అవార్డులు ఇచ్చేస్తాడు అంటూ సినీ వర్గాల్లో కొందరు అంటున్నారు.

పబ్లిసిటీతో పాటు తన రాజకీయ పలుకుబడి పెంచుకునేందుకు కూడా టీఎస్సార్‌ ఈ అవార్డులను, బిరుదులను ఉపయోగించుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అవార్డులు, బిరుదులు ఇవ్వడం వల్ల ఎలాంటి ఆలోచన లేకుండా టీఎస్సార్‌కు సినీ తారలు రాజకీయంగా వెన్ను దన్నుగా నిలుస్తారు. అందువల్ల ఆయన కోరుకున్నట్లుగా రాజకీయాల్లో అడుగులు వేయవచ్చు అనేది కొందరి వాదన. మరి కొందరు మాత్రం మంచి మనస్సుతో కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఆయన అవార్డులు ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా బిరుదులు ఇవ్వడం, అవార్డులు ఇవ్వడం తన అభిరుచి అంటాడు టీఎస్సార్‌.