Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబు హీరోగా చేస్తున్న సినిమా గాయత్రి. ఇటీవలే టైటిల్ లోగో బయటపెట్టిన చిత్ర యూనిట్ ఈ రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. మోహన్ బాబు హీరో, విలన్ గా చేస్తున్న ఈ సినిమాకు మదన్ దర్శకుడు. ఇంతకముందు మోహన్ బాబు డబల్ రోల్ చేసిన పెదరాయుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఇక రాయలసీమ రామన్న చౌదరి ఆ స్థాయిలో హిట్ కాకపోయినా మోహన్ బాబు కి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు గాయత్రి లో మోహన్ బాబు డబల్ రోల్ అన్న వార్తలు బయటికి వస్తున్నాయి. నేడు విడుదల అయిన ఫస్ట్ లుక్ కూడా ఇంప్రెస్ చేసేలా వుంది . దీంతో గాయత్రి మీద ఆసక్తి పెరిగింది. అయితే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కన్నా టైటిల్ కింద టాగ్ లైన్ ఇంకా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. “ ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే “ అంటూ రాసిన టాగ్ లైన్ మీద ఇప్పటికే చర్చ మొదలైంది.