Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మోహన్‌బాబు హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో రకాలుగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందించాడు. అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా గుర్తింపు ఉన్న మోహన్‌బాబు తాజాగా ‘గాయత్రి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత మోహన్‌బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. గతంలో మోహన్‌బాబు ఎన్నో పెద్ద చిత్రాలు నిర్మించి, బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను దక్కించుకున్నాడు. కాని ఇటీవల మోహన్‌బాబు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో నిర్మాతగా మోహన్‌బాబు ఫ్లాప్ అవుతూ వచ్చాడు. తాజాగా ‘గాయత్రి’ చిత్రంతో భారీ నష్టాలు రావడంతో మోహన్‌బాబు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు.
‘గాయత్రి’ చిత్రం నిర్మాతగా తన కెరీర్లో చివరిది అంటూ మోహన్‌బాబు ప్రకటించాడు. తాను మళ్లీ సినిమాలను నిర్మించబోను అంటూ క్లారిటీ ఇచ్చాడు. నిర్మాతగా తాను గతంలో పలు మంచి చిత్రాలను నిర్మించాను. కాని ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతగా కొనసాగడం అసాధ్యం అని తేలిపోయింది. అందుకే నిర్మాణంకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్లుగా మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు. అయితే నటుడిగా మాత్రం కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఊపిరి ఉన్నంత వరకు తాను నటుడిగా చేస్తాను, దర్శకుడిగా మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలనే కోరిక కూడా ఉందని మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు. మొత్తానికి మోహన్‌బాబు నిర్మాణ రంగంకు దూరంగా ఉంటాను అంటూ ప్రకటించడం మంచి నిర్ణయం అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.