21 లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో కేరళలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌పై దారుణమైన ప్రచారానికి ఒడిగట్టారు. మోహన్‌లాల్ కరోనావైరస్తో మరణించారంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు.
కరోనావైరస్ కారణంగా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరణించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. ఏప్రిల్ ఫూల్ అంటూ తర్వాత ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే ఇలాంటి ఎమోషల్ అంశాలను అల్లరి చేస్తూ, అకృత్యాలకు పాల్పడటంపై కేరళ పోలీసుల తీవ్రంగా స్పందించారు.
మోహన్‌లాల్ మరణంపై బోగస్ వార్తలు విజృంభిస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి ఫ్యాన్స్ రంగంలొకి దిగారు. రాష్ట్ర మోహన్‌లాల్ ఫ్యాన్స్, కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విమల్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. మోహన్ లాల్‌పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. అందులో నిజం లేదు అంటూ పోస్టులు పెట్టారు.
మోహన్‌లాల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేరళ పోలీసుల దృష్టికి ఫ్యాన్స్ అధ్యక్షుడు విమల్ కుమార్ తీసుకొచ్చారు. ఈ దారుణానికి కారణమైన పోకిరిపై పోలీసులకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేశారు. మోహన్‌లాల్ సినిమాలోని ఓ పాత సీన్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.