నాగ్ సవాల్ కి దీటుగా మోహన్ లాల్ కౌంటర్.

mohanlal Young look in odiyan and Nagarjuna six pack in RGV
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోల్లో ముందు వరసలో ఉండేది అక్కినేని నాగార్జున. ఆయనకి 58 ఏళ్ళు అంటే నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది. ఇది అతిశయం అనుకునేవాళ్లు ఇటీవల rgv విడుదల చేసిన ఓ నాగ్ ఫోటో చూసాక సారీ చెప్పేస్తారు. ఆ ఫొటోలో నాగ్ ఫిట్ నెస్ ఏ రేంజ్ లో వుందో చూసాక ఆయన వయసు 30, 40 మధ్య అని చెప్పినా నమ్మాల్సిందే. ఆ ఏజ్ గ్రూప్ హీరోల్లో అంతగా ఫిట్ నెస్ మైంటైన్ చేయడం లో నాగ్ కి ఎదురు లేదు అనుకుంటే ఇప్పుడు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సై అంటున్నాడు.

అవతార్ సినిమా గుర్తుందా ? అందులో హీరో ప్రకృతిని ప్రేమించే ఓ గ్రహం వాసుల్ని రక్షించడానికి ఎంత రిస్క్ చేస్తాడో?. కేరళ లో ఒడియాన్ అనే గిరిజన జాతి వుంది. మలబార్, పాలక్కాడ్ ప్రాంతంలో వుండే ఒడియాన్ గిరిజన తెగ యువకుడిగా నటిస్తున్న మోహన్ లాల్ ఆ పాత్ర కోసం రెండంటే రెండు నెలల్లో 18 కేజీలు తగ్గాడు. ఫిట్ నెస్ నిపుణుల సమక్షంలో శిక్షణతో ఈ ఫీట్ సాధించిన మోహన్ లాల్ ని చూస్తుంటే ఇతనికి 57 సంవత్సరాలు అంటే నమ్మలేం. రెండు నెలల పాటు బయట ప్రపంచానికి కనిపించకుండా వున్న మోహన్ లాల్ కొత్త గెట్ అప్ లో ఓ ఫంక్షన్ కోసం బయటికి వచ్చారు. అసలు వయసు కన్నా ఓ 20 ఏళ్ళు చిన్నగా కనిపిస్తున్న మోహన్ లాల్ ని చూస్తే నాగ్ కి గట్టి పోటీ అనక తప్పదు. నిజానికి నాగ్ తో పోల్చుకుంటే మోహన్ లాల్ బాగా బొద్దుగా కనిపించే శరీర తత్వం కలిగిన వాడు. అయినా కష్టంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మోహన్ లాల్ ఎందుకు ఇన్నేళ్ళుగా సూపర్ స్టార్ గా నిలబడ్డాడో వేరే చెప్పాలా ?