కత్తిని కడిగేసిన దర్శకుడు వివేక్‌.. పారిపోయిన కత్తి మహేష్‌

director vivek counter on kathi mahesh,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత కొన్ని నెలలుగా కత్తి మహేష్‌ మీడియాలో ఏ స్థాయిలో పాపులర్‌ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రతి విషయంలో విమర్శలు చేస్తూ ఫుల్‌గా పబ్లిసిటీ దక్కించుకున్న కత్తి మహేష్‌ మీడియాలో పవన్‌ ఫ్యాన్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నాడు. మీడియాలో ఎవరిపై అయినా విరుచుకు పడే కత్తి మహేష్‌ తాజాగా దర్శకుడు వివేక్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక స్టూడియో నుండి వెళ్లి పోయాడు. లైవ్‌ షో జరుగుతున్న సమయంలో కత్తి మహేష్‌ వెళ్లి పోవడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కత్తి మహేష్‌ను వివేక్‌ అడిగిన ఒక్క ప్రశ్న ప్రస్తుతం పవన్‌ ఫ్యాన్స్‌ మొత్తం అడుగుతున్నారు.

దర్శకుడు వివేక్‌ ఒక ఛానెల్‌లో కత్తి మహేష్‌తో కలిసి చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో కత్తి మహేష్‌తో మీరు మహిళల గురించి మాట్లాడుతున్నారు, మీ అమ్మ గురించి రెండు నిమిషాల పాటు మాట్లాడండి అంటూ కోరడం జరిగింది. ఆ సమయంలో కత్తి మహేష్‌ అందుకు నిరాకరించాడు. వివేక్‌ అదే విషయమై పదే పదే ప్రశ్నించడంతో కత్తి మహేష్‌ అసహనంకు లోనయ్యాడు. తన తల్లి గురించి అడగడం బాగా లేదని, ఇది సరైన చర్చ కాదు అంటూ తన మైక్‌ను పక్కకు పడేసి అక్కడ నుండి కత్తి మహేష్‌ వెళ్లి పోయాడు.

ఎంతో మంది గురించి మాట్లాడుతున్న కత్తి మహేష్‌ తన తల్లి గురించి రెండు మంచి ముక్కలు మాట్లాడలేక పోయాడు అంటూ వివేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కత్తి మహేష్‌ తల్లి గ్రామంలో చిట్టి పేరుతో గ్రామస్తులను లక్షల్లో మోసం చేసిందని, ఆ విషయం బయట పడుతుందనే ఉద్దేశ్యంతో కత్తి మహేష్‌ లైవ్‌ జరుగుతుండగా స్టూడియో నుండి వెళ్లి పోయినట్లుగా పవన్‌ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. మొత్తానికి పవన్‌ ఫ్యాన్స్‌కు కత్తి మహేష్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఆయుదంను దర్శకుడు వివేక్‌ ఇచ్చినట్లు అయ్యింది.