మరి కొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా ఉహించని సంఘటన జరిగింది. కొద్ది సేపట్లో తాళి కట్టాల్సిన వరుడి మీద లైంగిక దాడి కేసు పెట్టింది అతని ప్రియురాలు. ఘటన పూర్తి వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన ఓ యువతి హెరిటేజ్ సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తూ ఇందిరానగర్‌లో నివాసం ఉండేది. ఐదు ఏళ్ళ క్రితం ఆ సదరు యువతికి కరీంనగర్ చెందిన ఆకుల నరేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది, కొన్ని రోజులుగా ఇద్దరు కలిసి తిరిగారు, ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ సహజీవనం సాగించారు.
యువతి పలుమార్లు పెళ్లి ప్రస్తావన చేయగా, ఆ యువకుడు దాట వేస్తూ వచ్చేవాడు. ఇటీవల ఆమెకు కడుపు రాగా గత జూన్‌లో ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. అయితే ఇటీవల నరేష్ ఫోన్ లో ఓ యువతి ఫొటోను ఆ యువతీ నరేష్ ను నిలదీయగా తను నా సోదరి అంటూ బుకాయించాడు నరేష్. దీంతో అనుమానం వచ్చి అతడి స్నేహితులను ఆరా తీయగా అతనకి మరో యువతి తో పెళ్లి కుదిరింది అని ఈనెల 30న కరీంనగర్‌లో పెళ్లి జరుగుతున్నట్లు తెలుసుకుంది. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ కల్యాణ మండపానికి వెళ్ళిన యువతి పెళ్లి ఆపివేసింది. ప్రస్తుతం ఈ కేసు ను బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.