17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం​ అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. వివరాల ప్రకారం..యూపీలోని హమీర్‌పూర్‌ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆసుపత్రికి తరలించే నాటికి ఆమె పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో బుధవారం​ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆమె చనిపోయిన తర్వాతే విషయం తెలిసిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ రావాల్సి ఉందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తమ కుమర్తెపై ఐదుగురు వ్యక్తులు సోమవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి మీడియాతో వాపోయాడు. నిందితుల నుంచి ప్రాణహాని ఉంటుందేమోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపాడు.