Posted [relativedate]
+యాప్స్ నెట్ వాడకాన్ని ఇలా కంట్రోల్ చేయండి
+ఆండ్రాయిడ్‌లో ఉన్న ఆప్షన్‌తోనే పర్యవేక్షణ చేసుకోవచ్చు
వైఫైతో నిత్యం ఉచితంగా కావాలిసినంత ఇంటర్నెట్ వాడటం అలవాటైన వారు మొబైల్ డాటా కోసం రీఛార్జ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు.. ఒక జీబీ డాటా కావాలంటే దాదాపు రూ.200పైనే వెచ్చించాల్సి వస్తుంది.. కొద్దిపాటి డాటాని జాగ్రత్తగా వాడుకోవడానికి చూస్తుంటారు.. ఈ క్రమంలో అవసరమైనప్పుడే నెట్ ఆన్ చేసుకుని తరవాత ఆపేస్తుంటారు.. ఒకసారే అన్ని యాప్స్ నెట్ డాటా తీసుకుని ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఆన్‌లైన్‌షాపు వంటి యాప్స్ మొబైల్‌ని ఉక్కిరి బిక్కిరి చేయడం చూస్తునే ఉంటాం. ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ చెప్పేందుకు మన ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఉన్న ఆప్షన్‌ని వాడితే సరిపోతుంది. అదెలాగో చూద్దాం..
.
డాటా లిమిట్ పెట్టుకోవాలి..
ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తామో ఆ తేదీ గుర్తుపెట్టుకోవడం.. అంతే డాటా వాడాలని నిబంధన ఉన్నా మనకు గుర్తుండదు.. ప్రీపెయిడ్‌లో కనీసం నెట్ ఆపినప్పుడు ఎంత డాటా వాడామో చూపుతుంది.. అదే పోస్టుపెయిడ్ అయితే ఆ అవకాశం కూడా ఉండదు.. అందుకే సెట్టింగ్స్‌లో మొబైల్ డాటా లేదా డాటా యూసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది.. దాన్ని క్లిక్ చేసి సెట్ మొబైల్ డాటాని ఓకే చేయాలి. మనకు ఆ నెలలో ఎంత బాలెన్స్ వచ్చిందో లెక్కించి లిమిట్‌లో పెట్టాలి.. రెండు గీతలు వస్తాయి.. ఉదాహరణకు మనకు ఆ నెల ఒక జీబీ డాటా వాడుకోవాలి.. దానికోసం 1024 ఎంబీ డాటా లిమిట్ వచ్చేలా పై గీతని జరుపుకోవాలి.. కింద గీత మనల్ని ఎలెర్ట్ చేసుకునేందుకు ఉపయోగించుకోవాలి.. దాన్ని 500 ఎంబీ దగ్గర పెట్టామనుకుంటే.. కచ్చితంగా అంత డాటా వాడేసిన తరవాత మనకు ఎలెర్ట్ చూపుతుంది. దాంతో మనం జరిగిన రోజులకు తగిన విధంగా వాడుతున్నామా లేదా ఎక్కువ వాడుతున్నామో పరిశీలించుకోవచ్చు.. దానితోపాటు డాటా సైకిల్ ఉంటుంది. అక్కడ మనం రీఛార్జ్ చేసిన రోజును ఎంచుకోవాలి.. దానిపై క్లిక్ చేసిన వెంటనే కొన్ని డిఫాల్డ్ ఆప్షన్లు వాస్తాయి.. దానితోపాటు సైకిల్ చేంజ్ అని ఉంటుంది అక్కడ మనం రీఛార్జ్ లేదా పోస్ట్‌పెయిడ్ వాళ్లు బిల్లింగ్ డేట్ పెట్టుకోవచ్చు.. దాంతో మన డాటాపై నిరంతం పర్యవేక్షణ ఉంటుంది.
యాప్ వారీగా వాడకం చూపుతుంది
డాటా యూసేజ్ పర్యవేక్షణ మొదలైన దగ్గర నుంచి ఏ యాప్ ఎంత ఎంబీ వాడుతుందో జాబితా రూపంలో చూపుతుంది. ఎక్కువ వాడిన యాప్ పైనే ఉంటుంది. వాటిని నిశితంగా పరిశీలించి ఇవి మన ంవాడిన యాప్‌ఆ కాదా అని చూసుకోవాలి.. దానితోపాటు అక్కడ క్లిక్ చేస్తే ఆ యాప్ బ్యాగ్రౌండ్‌లో ఎంత వాడింది ఫోర్‌గ్రౌండ్‌లో ఎంత వాడింది విడిగా చూపుతుంది. ఫోర్ గ్రౌండ్ వాడకం అంటే మనం ఆ యాప్ ఓపెన్ చేస్తే నెట్‌కి కనెక్ట్ అయి మనముందు అందించిన సర్వీస్‌కు వాడే డాటా.. బ్యాగ్రౌండ్ అంటే ఆ యాప్ మనం వాడకుండానే దానంతట అదే డాటా వాడేస్తున్నట్లు లెక్క.. అలాంటివాటితోనే జాగ్రత్తగా ఉండాలి. మొదట ఆ తేడాలను నిర్దారించుకోవాలి.
డాటా నియంత్రించొచ్చు
బ్యాగ్రౌండ్ డాటా ఆయా యాప్స్ వాడకూడదని అనుకుంటే వెంటనే అక్కడ రిస్ట్రిక్ట్ అనే చిన్న చెక్ బాక్స్ ఉంటుంది..దానిపై క్లిక్ చేస్తే ఇక మనం ఓపెన్ చేస్తే తప్ప డాటా వాడదు. కొన్ని యాప్స్ బ్యాగ్రౌండ్‌లో పనిచేయడం అవసరం అలాంటి వాటికి అనుమతి ఇవ్వాలి.. మనకు నిరంతరం ఎలెర్ట్స్ ఇచ్చే వాట్సప్స్, ఫేస్‌బుక్, ట్రూకాలర్ వంటివి వాటిని వదిలేయాలి.. అవి బ్యాగ్రౌండ్‌లో పనిచేస్తేనే నోటిఫికేషన్లు వాస్తయి.. ఒక వేళ వద్దనుకుంటే వాటికీ పెట్టొచ్చు.. కాకపోతే మనం ఓపెన్ చేస్తేనే అవి అప్పుడు అప్‌డేట్ తీసుకుని కొత్త మెసేజ్‌లుచూపుతాయి. ఇవి కాక దాదాపు మిగిలిన అన్ని యాప్స్‌కు రిస్ట్రిక్ట్ చేస్తే డాటా వినియోగం పూర్తిగా నియంత్రించొచ్చు. దాంతో అప్పుడప్పుడే డాటా ఆన్ చేసుకవాల్సిన అవసరం ఉండదు. డాటా ఆన్‌లో ఉన్నా నిరంతం పర్యవేక్షణ.. నియంత్రణలో ఉంటుంది. మన జేబుకు చిల్లుపడకుండా ఉంటుంది.
– శ్రీ