విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి

విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి

విషపూరిత బజ్జీలు తిని తల్లీకొడుకు మృతి చెందిన సంఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి , కుమారుడు సోమనింగప్ప కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటారు.సోమవారం ఇద్దరూ ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు.

రాత్రికి ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతిచెందారు. బజ్జీ­ల్లో పురుగులు మందు కలిసి ఉంటుందని, ఇది అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా కుట్ర పన్ని చేశారా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.