వరంగల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 7నెలల ఆడబిడ్డను రూ.1000కి అమ్మాకానికి పెట్టింది ఓ తల్లి. జనగామ జిల్లా పెంబర్తికి చెందిన దంపతులు జ్వరంతో బాధపడుతున్న 7నెలల ఆడబిడ్డను మంగళవారం వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చారు.
అక్కడికొచ్చాక దంపతులిద్దరికీ గొడవ జరిగింది. దీంతో భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. భర్తపై చిర్రెత్తుకొచ్చిన మహిళ తన ఆడబిడ్డను వరంగల్ బస్టాండ్‌కు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టింది. రూ.వెయ్యి తన బిడ్డను ఇచ్చేస్తానని కొందరికి చెప్పింది.
దీంతో మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను ప్రశ్నించారు.
చిన్నారిని శిశు సంక్షేమ శాఖాధికారులకు అప్పగించారు. భర్తపై కోపంతో నవమాసాలు మోసి కన్న బిడ్డను అమ్మకానికి పెట్టిన మహిళపై స్థానికులు మండి పడుతున్నారు.