కన్నతల్లే డిగ్రీ చదువుతున్న తన కూతురిని వ్యభిచార కూపంలోకి దింపాలని ప్రయత్నించింది. తల్లి వేధింపులు భరించలేక ఆ కూతురు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే సుజాతకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
ఏడేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో కుటుంబ పోషణ భారం ఆమె మీదే పడింది. తన సంపాదన చాలక పోవడంతో ఇద్దరు పెద్ద అమ్మాయిలను తన దగ్గర ఉంచుకొని మూడో కూతుర్ని భర్త తమ్ముడి దగ్గరికి పంపించింది. బాబాయి దగ్గరే ఉంటున్న చిన్న కూతురు ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజుల క్రితం తన ఆరోగ్యం బాగోలేదంటూ సుజాత చిన్న కూతురికి కబురు పెట్టింది.
ఆమె రాగానే మెల్లగా మాటల్లోకి దింపి కుటుంబం గడవడం కష్టంగా ఉంది. డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి నువ్వు వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి చిన్నకూతురు అంగీకరించలేదు. తల్లి దగ్గర్నుంచి తప్పించుకొని బాబాయి దగ్గరకు వెళ్లిపోయింది. అమ్మ ఇలా అంటోందని బాబాయి దగ్గర గోడు వెళ్లబోసుకుంది.
ఆమెను సముదాయించిన చిన్నాన్న ఇంకెప్పుడూ అమ్మ దగ్గరకు వెళ్లొద్దని చెప్పాడు. తన ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో సుజాత మరిది మీద కిడ్నాప్ కేసు పెట్టింది. తన కూతుర్ని మరిది ఎత్తుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు అది నిజం కాదని తేల్చారు.
కానీ పట్టువదలని సుజాత చిన్న కూతురిని తీసుకెళ్లి వ్యభిచారం చేయించాలని పదే పదే ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. కన్న తల్లే ఇలా వేధిస్తుండటంతో అమ్మ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ చిన్న కూతురు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. అమ్మ ఇప్పటికే ఇద్దరు అక్కలను వ్యభిచార ఊబిలో దించింది. ఇప్పుడు నన్ను కూడా వ్యభిచారం చేయాలని అంటోందని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది.