డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైన మూవీ “ఆరంభం”..!

Movie
Movie "Arambam" ready for digital premiere..!

ఇటీవ‌ల తెలుగులో ఆరంభం అనే మూవీ థియేటర్ల లోకి వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా రిలీజ్ కు ముందు మంచి బజ్ ని సొంతం చేసుకుంది. కానీ, విడుదలైన తర్వాత, ఆరంభం పేలవమైన సమీక్షలను అందుకుంది, అందువల్ల, అది బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది.

మే 23 నుండి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది. థియేట్రికల్ మరియు OTT విడుదల మధ్య రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్నది . మోహన్ భగత్, భూషన్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుప్రీత సత్యనారాయణ, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల ల్లో కనిపించారు. అజయ్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ ట్రావెల్ మూవీ ని అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. సింజిత్ యర్రమిల్లి స్వరాలు సమకూర్చారు.