టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్య రాజేష్,రాశీ ఖన్నా,క్యాథెరిన్ మరియు ఇజబెల్ లెయిట్ లు హీరోయిన్లుగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు అన్నప్పుడే సినిమాపై ఒక రకమైన అంచనాలు ఏర్పడ్డాయి.”డియర్ కామ్రేడ్” ప్లాప్ గా నిలవడంతో ఈ సినిమా హిట్ కావడం విజయ్ కు ఎంతైనా అవసరం ఉంది.డియర్ కామ్రేడ్ లానే దీనిని కూడా ఇతర భాషల్లో విడుదల చేసారు.ఈ లవర్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ “వరల్డ్ ఫేమస్ లవర్” ఎంత వరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథలోకి వెళ్లినట్టయితే గౌతమ్(విజయ్ దేవరకొండ) మరియు యామిని(రాశీ ఖన్నా)లు తమ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు.అలాగే మరోపక్క భార్య భర్తలైనటువంటి శీనయ్య(విజయ్) మరియు సువర్ణ(ఐశ్వర్య రాజేష్)లు ఓ సామాన్య మధ్య తరగతి జీవనం గడుపుతుంటారు.అయితే అసలు ఈ కథలో (స్మిత)క్యాథెరిన్ మరియు ఇజబెల్ లేయిట్ కు ఉన్న సంబంధం ఏమిటి?ఈ గౌతమ్ మరియు శీనయ్యలు ఇద్దరా లేక ఒకరా?వారి వెనుకున్న కథలు ఏమిటీ అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోల్చుకున్నట్టయితే ఈ చిత్రానికి ఏమంత భారీ బజ్ ఏర్పడలేదు.అయినప్పటికీ విజయ్ తనదైన ప్రమోషన్స్ తో విడుదల రోజుకు సరిపడా హైప్ ను తెచ్చుకున్నాడు.అయితే ఆ హైప్ సినిమా చూసాక పెద్దగా కంటిన్యూ కాకపోవచ్చు.మొదటగా కంటెంట్ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రం హీరోతో కలిపి మొత్తం ఐదుగురు పాత్రల చుట్టూ తిరుగుతుందన్న సంగతి అందరికీ ముందే తెలిసిన విషయమే.
కానీ సినిమాలో మాత్రం విజయ్,ఐశ్వర్య మరియు రాశి ఖన్నాల రోల్స్ కీ రోల్ పోషించాయి.విజయ్ అయితే ఒకే సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించి తనదైన నటనతో మరోసారి అదిరిపోయే పెర్ఫామెన్స్ ను అందించాడు.నలుగురు హీరోయిన్లకు నాలుగు వేరియేషన్స్ లో ఓ పక్క తనలోని ప్లే బాయ్ పాత్రను మరోపక్క లవర్ బాయ్ గా ఓ భర్తగా అద్భుతమైన నటనను కనబర్చారు.అలాగే ఈ సినిమాకు నటన పరంగా మరో మెయిన్ ఎస్సెట్ ఐశ్వర్య రాజేష్ అని చెప్పాలి.
ఓ మధ్య తరగతి జీవనం గడిపే భార్యగా మంచి నటన కనబర్చింది.అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన బెస్ట్ ను అందించింది.అలాగే రాశీ కూడా మంచి పెర్ఫామెన్స్ ను కనబర్చింది.ఇలా ఫస్ట్ మరియు సెకండాఫ్ లు జస్ట్ ఓకే గానే అనిపిస్తాయి తప్ప సినిమా చూసే ప్రేక్షకుడికి ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు.ఇక దర్శకుడు కె క్రాంతి మాధవ్ తన సినిమాలో పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వారిపై నడిచే కథకు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది.
తాను తీసుకున్న నాలుగు ట్రాక్స్ లో రెండు ట్రాక్స్ సినిమాలో ఏమంత ఇంపాక్ట్ ను కలిగించవు.దాని మూలాన తాను చెప్పదలచుకున్న జీవిత సూత్రం మిస్ ఫైర్ అయ్యింది.అలాగే నెమ్మదిగా సాగించే కథనం అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయ్యిపోవడం,ఎలాంటి ఎంటర్టైన్మెంట్ హంగులు లేకపోవడం వంటివి సినిమా చూసే ప్రేక్షకునికి ఈ చిత్రంపై ఆసక్తిని తగ్గించేస్తాయి.అలాగే ఇంతకు మునుపు అద్భుతమైన ఆల్బమ్స్ ను ఇచ్చిన గోపీ సుందర్ ఈ సినిమాతో విజువల్ గా ఓకే అనిపిస్తారు.జయకృష్ణ గుమ్మడి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది,పాటల్లో మరింత బాగుంది.
ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ప్రేమికుల దినోత్సవం రోజున సందర్భంగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదల కాబడిన “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రం విజయ్,ఐశ్వర్య మరియు రాశీ ఖన్నాల మధ్య ఎమోషనల్ ట్రాక్స్ పండినా సరైన స్క్రీన్ ప్లే మరియు ఆకట్టునే కథనాలు లేకపోవడం మూలాన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.మరి విజయ్ అభిమానులు ఈ చిత్రాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తారో చూడాలి.