ప్రభాస్ – రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రానికి పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రానికి `జాన్` అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ టైటిల్ అభిమానులకు పెద్దగా ఎక్కలేదు. పైగా… దిల్ రాజు `96` రీమేక్ కి `జానూ` అనే టైటిల్ పెట్టారు. రెండు టైటిళ్లూ దగ్గర దగ్గరగా ఉన్నాయి. దాంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సుంది. అందుకే ఇప్పుడు ఈ టైటిల్‌ని మార్చే ఆలోచనలోఉన్నట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్సంస్థ ఫిల్మ్ ఛాంబర్లో రెండు కొత్త టైటిళ్లని రిజిస్టర్ చేయించింది. అందులో `ఓ డియర్`, `రాధే శ్యామ్` అనే పేర్లు రిజిస్టర్ చేయించింది. ఇవి రెండూ ప్రభాస్ సినిమా కోసమే అని టాక్. ఇదో ప్రేమ కథ. దానికి తగ్గట్టుగానే టైటిల్ సాఫ్ట్‌గా ఉండాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే జాన్ అనే పేరు ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని ఈ రెండు పేర్లూ రిజిస్టర్ చేసి పెట్టారు. మరి వీటిలో ఏది ఫైనల్ చేస్తారో చూడాలి.