రైతులకు, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ అమరావతి సభా ప్రాంగణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బయలుదేరారు. ఇవాళ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం పసుపు రంగు సైకిల్ మీద సైకిల్ యాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిందని, మన రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితికి జగన్ తీసుకువచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వలో మళ్లీ అమరావతికి పునర్ వైభవం వచ్చిందని, రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా రూపొందుతున్నాయని తెలిపారు.





