ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా నే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావించి మూడు రాజధానులు రాష్ట్రానికి అవసరమని అసెంబ్లీ లో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అడ్డుపడి, శాసన మండలి ద్వారా బిల్లు ని సెలెక్ట్ కమిటీ కి పంపడం జరిగింది అంటూ వైసీపీ నేతలు ఆందోళన చేసారు. అయితే ప్రస్తుతం ఈ మూడు రాజధానుల అంశం ఫై తాజా పరిణామాల ఫై చంద్రబాబు వైఖరి ని ఖండిస్తూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.
రాజధాని ఫై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంట్ లో సంబంధిత మంత్రి వెల్లడించారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కు అని తెలిపారు. అయితే ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటుంది, అయితే దీని ఫై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జివిఎల్ గారి ఫై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు.