మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వికెట్ కీపర్, వన్డే బ్యాట్స్‌మన్ ఇలా ఒకరకంగా చాలాబాధ్యతలు నెత్తినే వేసుకున్నాడు. అంత రేంజ్ లో ఉన్న వ్యక్తికి మామూలుగా అయితే కొమ్ములు వచ్చేస్తాయి. కానీ ధోనీ అలా కాదు తానెప్పుడు స్పెషల్ అని నిరూపిస్తూనే ఉంటాడు. దానికి మనం కొన్ని సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుచుకుంటారు. ఎంత ఒత్తిడిలో ఉన్న ధోని తన స్వభావంలో ఎటువంటి మార్పు లేకపోవడం వల్లే అభిమానులు అలా పిలుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ధోనిలో అందరికీ నచ్చే గుణం నిరాడంబరత.
ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన ధోనికి ఎంత ఫాలోయింగ్ ఉన్నా.. నిరాడంబరంగా జీవించడానికి ఎక్కువ ఆసక్తిని కనబర్చుతాడు. ధోనీ అంత రేంజ్ లో ఉన్న గొప్ప క్రికెటర్ ఎలాంటి నామోషీ లేకుండా మైదానంలోని సహచరుల కోసం నీళ్ల సీసాలు పట్టుకెళ్లాడు. ఈ శుక్రవారం ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా భారత జట్టు కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. అందులో ధోని కూడా ఒకడు. ఐతే అదనపు ఆటగాడిగా ధోని డ్రెస్సింగ్ రూంలో ఊరికే ఏమీ కూర్చోలేదు. రాహుల్, రైనా బ్యాటింగ్ చేస్తున్నపుడు నీళ్ల సీసాలు తీసుకుని మైదానంలోకి వెళ్లడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాక సొంతూరు జార్ఖండ్ వెళ్లినప్పుడు రాంచీ వీధుల్లో బైక్‌పై తిరుగుతుంటాడు.
ఇప్పుడు హెయిర్ కట్ విషయంలో కూడా ధోని నిరాడంబరత వార్తల్లో నిలిచాడు. అదేమిటి అంటే వీధిలో ఉండే బార్బర్‌తో తన ఇంట్లోనే హెయిర్ కట్ చేయించుకుంటున్న ఫోటో ఒకటి ధోని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో అప్పట్లో ఇంటర్నెట్‌లో వైరల్‌లాగా మారింది. ఎందుకంటే సెలబ్రిటీలకు ప్రత్యేకంగా హెయిర్ స్టైలిస్ట్స్ ఉంటారు. ధోనీకి కూడా సప్నా భవ్‌నాని అనే హెయిర్‌స్టైలిస్ట్ ఉంది. కానీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి హెయిర్ కట్ చేసుకోకుండా ఇంట్లోనే ఇలా సాధారణ వ్యక్తిలా వెంట్రుకలు కట్ చేసుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా ఇవే కాక ధోనీ నిరాడంబరతకి ఉదాహరణ చెప్పే ఘటనలు కోకొల్లలు. అలాంటి ధోనీ పుట్టిన రోజు ఈ జూలై 7 న జరగనుంది సో మన మిస్టర్ కూల్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పేద్దామా