“మృణాల్ ఈజ్ బ్యాక్.. డెకాయిట్‌లో ఇంటెన్స్ రోల్ “

"Mrunal is back.. with an intense role in Decoyt"
"Mrunal is back.. with an intense role in Decoyt"

మన టాలీవుడ్ లో తన మొదటి మూవీ తోనే మంచి హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కోసం తెలిసిందే. సీతారామం అలాగే హాయ్ నాన్న సినిమా ల తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తాను అందుకోగా ది ఫ్యామిలీ స్టార్తో మూవీ తో మాత్రం తన హిట్ స్ట్రీక్ కి బ్రేక్ పడింది. అయితే ఆ తర్వాత మళ్ళీ కల్కి 2898 ఎడి లో తెలుగులో కనిపించింది కానీ తెలుగులో హీరోయిన్ గా నెక్స్ట్ మూవీ ఏది అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

"Mrunal is back.. with an intense role in Decoyt"
“Mrunal is back.. with an intense role in Decoyt”

మరి ఎట్టకేలకి మళ్ళీ మృణాల్ తెలుగు సినిమాలో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ లో కనిపించేందుకు సిద్ధం అయ్యింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న “డెకాయిట్” మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేశారు. తనపై ఒక ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ఈమె నుంచి ఉన్నట్టుగా రివీల్ చేశారు. మరి నేడు శేష్ బర్త్ డే కానుకగా వీటిని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ కి షానియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సినిమా రాబోతోంది .