మురారి రీ రిలీజ్: మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ షో

Murari Re Release: Mahesh Babu Birthday Special Show
Murari Re Release: Mahesh Babu Birthday Special Show

టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా మొత్తం మహేశ్ బాబు బర్త్ డే విషెస్తో వెల్లువెత్తుతుంది . ఇక సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఆయన మూవీ ల్లో బ్లాక్ బస్టర్ అయిన మురారీని రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. రీ రిలీజ్కు ముందే అత్యంత వేగంగా రూ.కోటి వసూలు చేసిన మూవీ గా మురారి’ రికార్డు క్రియేట్‌ చేసింది.

Murari Re Release: Mahesh Babu Birthday Special Show
Murari Re Release: Mahesh Babu Birthday Special Show

కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్గా నటించిన ఈ కుటుంబ కథా మూవీ ఇవాళ బిగ్ స్క్రీన్‌పై మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇటీవల డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘మురారి’ సినిమా కి తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహేశ్‌బాబు అమితంగా ఇష్టపడే మూవీ ల్లో ఇది కూడా ఒకటని తెలిపారు.

Murari Re Release: Mahesh Babu Birthday Special Show
Murari Re Release: Mahesh Babu Birthday Special Show