కారులో మృతదేహం ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. మృతదేహాన్ని జడ్‌ఎక్స్‌ఎన్ సిలిండర్ల కంపెనీ ఓనర్ రాహుల్ గా గుర్తించారు. రాహుల్ ను హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. రాహుల్ మృతిలో హత్య కోణం పై అనుమానాలు బలపడుతున్నాయి. ఆర్ధిక లావాదేవీల కారణంగానే హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కారు లో ఒక్కరే ఉండి ఉంటే కారు కీ ఏమయ్యింది అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడి మెడకింది భాగం ఒరుసుకు పోయినట్లు క్లూస్ టీం గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేశారు. కారు తిరిగిన ప్రాంతం లో సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ హత్య వెనుక ఫైనాన్స్ వ్యాపారి హస్తం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.