కులశేఖర్‌ ఇలా కావడానికి ప్రధాన కారణం…!

Music-Director-RP-Patnaik-A

తెలుగు సినిమా పరిశ్రమలో పాటల రచయితగా మంచి పేరును దక్కించుకుని ఎన్నో అవార్డులు మరియు రివార్డులు దక్కించుకున్న కులశేఖర్‌ తాజాగా ఒక దొంగతనం కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. కులశేఖర్‌ అరెస్ట్‌ అయిన తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. కులశేఖర్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంతనం చేస్తున్నాడని కొందరు మరికొందరు బ్రహ్మణ సమాజంపై కోపంతో ఆయన ఇలా చేస్తున్నాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కులశేఖర్‌కు ఆప్తుడు, కులశేఖర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ స్పందించారు. పలు ఆసక్తికర విషయాలను మీడియాతో ఆయన షేర్‌ చేసుకున్నారు.

kula-shaker-rp-patnayak

కులశేఖర్‌ గురించి ఆర్పీ మాట్లాడుతూ.. కులశేఖర్‌ చాలా ప్రతిభ ఉన్న వ్యక్తి. కుక్క కావాలి.. అనే పాట తేజ గారు రాయించేందుకు చాలా కష్టపడ్డాడు. ఎంతో మంది రచయితల వద్దకు వెళ్లాడు. కాని చివరకు నేను పరిచయం చేసిన కులశేఖర్‌ ఆ పాటను రాశాడు. అప్పటి నుండి కులశేఖర్‌తో పలు సినిమాలకు తేజ గారు వర్క్‌ చేశారు. ఏదైనా పాటను రాసినప్పుడు ఆయన వినిపించేందుకు ఒక ట్యూన్‌ లో పాడుతాడు. ఆ ట్యూన్‌ బాగాలేదని చెప్పే ప్రయత్నం చేస్తే ఆగ్రహిస్తాడు. ఒకసారి నేను, తేజ గారు ఆయన రాసిన లిరిక్‌ బాగుందని చెప్పాం, కాని పాడిన ట్యూన్‌ బాగాలేదని అనడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించుకున్నాడు. కళాకారులను మీరు అవమానించారు. అందుకు మీరు నాశనం అవుతారు అంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతి కోపం వల్లే ఆయన ఈ స్థితికి వచ్చాడనేది ఆర్పీ పట్నాయక్‌ అభిప్రాయం.

RP-Patnaik