Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో ఓ భారీ వివాహం జరుగుతోంది. ఈ నెల 23 న శంషాబాద్, జీఎంఆర్ లో జరిగే కల్యాణ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే మతి పోతోంది. దేశం లోని ప్రముఖ వ్యక్తులకి అందించే ఒక్కో శుభలేఖ ఖరీదు లక్షన్నర దాకా వుంటుందట. ఇలాంటి కార్డు లు 250 దాకా పంచుతారట. ఈ కార్డు తో పాటు పట్టు చీర, పట్టు పంచె, చిన్నపాటి వెండి, బంగారు వస్తువులు కలిపి పంచుతున్నారట. ఈ కార్డు లు వీవీఐపీ లకు మాత్రమే అట. ఇక VIP ల కోసం లక్ష రూపాయల విలువైన కార్డులు పంచారట. ఇక మామూలు వారి కోసం పంచిన శుభలేఖలు ఖరీదు సైతం వంద రూపాయల దాకా ఉందని చెప్పుకుంటున్నారు.
ఇంత కాస్ట్ లీ పెళ్లి ఎవరిదంటే ఎన్ టీవీ చౌదరి కుమార్తెది. ఆమెని ఓ వ్యాపార కుటుంబానికి చెందిన వరుడిని ఎంపిక చేశారట. అల్లుడి స్థాయికి తగినట్టు ఓ 50 కోట్ల విలువైన చిన్న విమానం కానుకగా ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత వుందో గానీ తెలుగు రాష్ట్రాల్లో విమానం ఇచ్చే స్థాయి పెళ్లి అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటారో కదా. ఈ పెళ్ళికి దేశం లోని ప్రముఖ రాజకీయ నేతలు చాలా మంది హాజరు అయ్యే అవకాశం ఉందట. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎదురయ్యే ట్రాఫిక్, భద్రత సమస్యల కోణంలో ఆలోచించి వివాహ వేదిక ని శంషాబాద్ లో నిశ్చయించారట.
మరిన్ని వార్తలు: