Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాపేరు సూర్య’. ఆర్మీ ట్రైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, నాగబాబులు కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన పస్ట్ ఇంపాక్ట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీ మరియు మలయాళంలో ఈ సినిమా సంచలనం సృష్టించబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. హిందీలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ఏకంగా 13 కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది. ఇక మలయాళంలో బన్నీ క్రేజ్ భారీగా ఉంది. అక్కడ 10 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతుంది.
తమిళంలో కూడా బన్నీ గత చిత్రాల కంటే డబుల్ రేటుకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది. ఇంకా పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 15 కోట్ల మేరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆన్‌లైన్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కలుపుకుని మొత్తంగా 100 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. బన్నీ క్రేజ్‌ను ఈ చిత్రం మరింత పెంచడం ఖాయం అని, దేశ వ్యాప్తంగా ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.