బన్నీ సినిమాకు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌కు కూడా!

Naa Peru Surya Naa Illu India Movie Release in Seven Languages

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియో ఏ రేంజ్‌లో సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వీడియో వల్ల సినిమాకు విపరీతమైన క్రేజ్‌ దక్కింది. తెలుగులోనే కాకుండా తమిళం మరియు ఇంకా పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దాంతో ఈ చిత్రాన్ని మొత్తం ఏడు భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇండియన్‌ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఒక ఆర్మీ ట్రైనర్‌గా కనిపించబోతున్నాడు. ఇండియన్‌ ఆర్మీలో జవాన్‌లు ఎలాంటి శిక్షణ తీసుకుంటారు, ఆర్మీ ఎంత క్రమశిక్షణతో ఉంటుంది అనే విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమాపై ఇండియన్‌ ఆర్మీ గురించి చూపించనటువంటి సీన్స్‌, సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, మరాఠీ, బోజ్‌పురిలో కూడా విడుదల చేయబోతున్నారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్నాడు. సునాయాసంగా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లను కొల్లగొట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక తెలుగు ఆర్మీ చిత్రం ఇన్ని భాషల్లో విడుదల కాబోతుండటం, ఆ చిత్రంలో బన్నీ హీరో అవ్వడం గర్వకారణం అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుగు సినిమాకే గౌరవం అంటూ సినీ వర్గాల వారు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.